ఎస్‌ఐఆర్‌పై అవగాహన చైతన్యానికి నాంది

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎస్‌ఐఆర్‌పై అవగాహన చైతన్యానికి నాంది
– ఓటును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఉత్సహాంగా 2కే రన్‌ కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్‌ఐఆర్(ఓటర్ల సమగ్ర సవరణ)పై అవగాహన పెంచుకోవడంతో చైతన్యానికి నాంది పలికనట్లు అవుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి సెయింట్ మార్క్స్‌ స్కూల్‌ వరకు 2కే రన్‌ ఉత్సహాంగా కొనసాగింది. ఎమ్మెల్యేతో పాటు డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, ఎస్‌ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, మున్సిల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, అధికారులు, నేతలు 2కే రన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అన్నారు. ఎస్‌ఐఆర్ అవగాహన కోసం వేస్తున్న ప్రతి అడుగు ప్రజా చైతన్యానికి నాంది అతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు.. దానిని పరిరక్షించడం, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం మనందరి బాధ్యత అని అన్నారు. 2కే రన్ కేవలం ఒక పరుగు కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రజా చైతన్య యాత్ర అని అన్నారు.

నకిలీ ఓట్లకు తావులేకుండా, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా ప్రతి బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత కలిసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. ‘మన ఓటు – మన భవిష్యత్తు’, ‘ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి’ అనే సంకల్పంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రవూఫ్‌, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, టీపీసీసీ మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, ఎమ్మార్వోలు, అధికారులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి