ఏడాదిలో కొత్త మార్కెట్ యార్డు
– గంజ్ వ్యాపారులకు అండగా ఉంటా
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఘనంగా దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఏడాది కాలంలో తాండూరు వ్యవసాయ మార్కెట్కు కొత్త యార్డును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్లో ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులుగా బానకారి క్రిష్ణ, కార్యదర్శిగా దర్మీది ప్రభు, సహా కార్యదర్శులుగా నాగారం జగదీశ్వర్, కోశాధికారిగా సిహెచ్ భోజిరెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులుగా ఎన్. జైపాల్ రెడ్డి, కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, చామ్కూర్ విశ్వనాథ్, బిక్కుమళ్ల శ్రీధర్, రాజేష్ సోని, దీనేష్ సింగ్, మంకాల రవీందర్, టి.బాలేశ్వర్ గుప్త, మల్లేపల్లి మధుసూదన్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు గంజ్ వ్యాపారులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గంజ్ వ్యాపారులకు అండగా ఉంటానని, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి ముందు ఉంటానని అన్నారు. వ్యాపారుల కోసం వచ్చే యేడాదిలోగా తాండూరు కొత్త మార్కెట్ యార్డును అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. అన్ని సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు చేయడం జరుగుతుందని అన్నారు.

మరోవైపు నూతన అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి దర్మీది ప్రభులు మాట్లాడుతూ అసోసియేషన్ అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అసోసియేషన్ సభ్యులు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, టీపీపీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, కౌన్సిలర్లు, అసోసియేషన్ మాజీ సభ్యులు, పెద్దలు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


