శభాష్‌.. చందన దీప్తీ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్‌.. చందన దీప్తీ..!
– ‘స్వచ్ఛ తాండూరు’పై ప్రసంగంతో ఆకట్టుకున్న విద్యార్థిని
– అభినందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గంగోత్రి విద్యాలయానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని వడ్ల చందన దీప్తి ప్రతిభ కనబరిచింది.

‘స్వచ్ఛ తాండూరు’ అంశంపై ఆమె చేసిన ప్రసంగం ఆకట్టుకోవడంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అభినందించారు. స్వచ్ఛ వారోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, డ్రామా, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.

అయితే బుధవారం పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ‘స్వచ్ఛ తాండూరు’పై చందన దీప్తి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. దీంతో ఎమ్మెల్యే విద్యార్థిని చందన దీప్తిని ప్రశంసించారు. మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.

ఆపదలో సీఎంఆర్‌ఎఫ్‌ అండ..!