ఆపదలో సీఎంఆర్‌ఎఫ్ అండ..!
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో 261 మందికి రూ.1.50 కోట్ల చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.50 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సీఎంఆర్‌ఎఫ్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే భరోసా అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, కౌన్సిలర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


