గొల్ల కురుమలు ఆధైర్య పడొద్దు..!
– పది రోజుల్లో గొర్రెలు ఇప్పించే బాధ్యత నాది
– భరోసా అందించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్‌లోని గొల్ల కురుమలు ఆధైర్య పడోద్దని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభయమిచ్చారు. అర్హులైన గొల్ల కురుమలకు పది రోజుల్లో గొర్రెలు పంపిణీ చేసేలా కృషి చేస్తానని భరోసా అందించారు. శుక్రవారం కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ గొల్ల కురుమలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మూడు నెలల క్రితం గొర్రెల కోసం ప్రభుత్వానికి డీడీలు కట్టినా ఇప్పటి వరకు గొర్రెలను పంపిణీ చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి గొల్ల కురుమల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, జిల్లా కలెక్టర్‌తో చర్చించి న్యాయం చేస్తామన్నారు. వారం, పది రోజుల్లో డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి గొర్రెలను ఇప్పించే బాధ్యత నాది అని భరోసా అందించారు.
ఇందుకు గొల్ల కురుమలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రె కాపరుల సంఘం డివిజన్ అధ్యక్షులు పల్లె వెంకటయ్య, కురుమ సంఘం డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్, ప్రధాన కార్యదర్శి ఇందూర్ మల్లేశం, పూజారి పాండు, తాండూరు మండల గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు జనుగుర్తి కురువ నర్సింలు, నాగులపల్లి నర్సింలు, కురువ బాలు, మల్లాపూర్ శ్రీనివాస్, బషీరాబాద్ మండలం అంజయ్య, శివప్ప, గొల్ల మల్లేశం, కౌన్సిలర్ బాలప్ప, వీరేశం, అగ్గనూరు గుండప్ప, పూజారి మల్లప్ప, వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారి హనుమయ్య, మల్లప్ప, నియోజకవర్గ గొల్ల కురుమలు, నేతలు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

