నేషనల్ హైవేకు బ్రేక్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నేషనల్ హైవేకు బ్రేక్..!
– పనులు అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు
– బిల్లుల పెండింగ్ పట్ల ఆందోళన
– పురుగుల మందు సేవిస్తామని హెచ్చరిక
– యజమాన్యంతో చర్చిస్తామని ప్రతినిధుల దాటవేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : కోస్గి నుంచి తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించొల్లి వరకు చేపడుతున్న నేషనల్ హైవే రోడ్డు పనులకు సబ్ కాంట్రాక్టర్లు బ్రేక్ వేశారు. పనులు చేపడుతున్న ప్రతినిధులు బిల్లులు చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు. బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేయాలని చూస్తే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చారు.

శనివారం యాలాల మండలం లక్ష్మీనారాయణ చౌరస్తాలోని సాన్వేర్ రైల్ టెక్ ప్రైవేట్ లిమిటేడ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కోస్గి నుంచి తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చించొల్లి వరకు 167 జాతీయ రహదారి పనులను హైదరాబాద్ లోని ఓ సంస్థ టెండర్ దక్కించుకుందని తెలిపారు. ఆ సంస్థ ద్వారా సాల్వేర్ రైల్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తుందని తెలిపారు. ఈ సంస్థకింద రోడ్డు కోసం వాహనాలతో పాటు మట్టి, గ్రావెల్, పిచ్ వంటి వివిధ పనులను నిర్వహించేందుకు పదుల సంఖ్యలో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్నారని తెలిపారు.
kvcs
అయితే కంపెనీ నుంచి నిధులు విధులైనా కూడా సాన్ వేర్ ప్రాజెక్టు మేనేజర్. డైరెక్టర్లు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చె శారు. ఒకరికి 8 నెలలు, మరికొందరికి 2 నుంచి 4 నెలల బిల్లులు చెల్లించడం లేదన్నారు. బిల్లులను పక్కదారి పట్టిస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల జీఎస్టీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పనులు చేస్తున్న కార్మికులకు వసతులు కల్పించడం లేదని అన్నారు. బిల్లులు చెల్లించాలని ప్రశ్నిస్తే.. సబ్ కాంట్రాక్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోతే కార్యాలయం ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు. ఈ విషయంపై సాన్ వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ యజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, మంగళవారం రోజు వరకు వేచి చూడాలని దాటవేశారు. మంగళవారంలోపు సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని సబ్ కాంట్రాక్టర్లు హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

బెల్టు షాపుపై భగ్గుమన్నారు..!