మృతుల కుటుంబానికి అండగా ఉంటాం

క్రైం తెలంగాణ రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబానికి అండగా ఉంటాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎన్ నేతల అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌షీరాబాద్ మండ‌లం దామ‌ర్చేడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌లు ల‌క్ష్మ‌య్య‌, ర‌మేష్‌లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హైద‌రాబాద్ లో ఉండే గ్రామానికి చెందిన ఓట‌ర్ల‌ను క‌లిసి.. బీఆర్ఎస్ కు ఓటు వేయాల‌ని రిక్వెస్ట్ చేసేందుకు తుపాను వాహ‌నంలో బ‌య‌లుదేర‌గా హైద‌రాబాద్ అజీజ్ న‌గ‌ర్ స‌మీపంలో వాహ‌నం రోడ్డు ప్ర‌మాదానికి గురైంది.

ఈ ప్ర‌మాదంలో వారు ఇరువురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు దామ‌ర్చేడ్ గ్రామంలో నిర్వ‌హించిన ర‌మేష్ అంత్య‌క్రియ‌ల్లో పాడె మోశారు. ర‌మేష్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని.. నా వంతుగా అన్ని విధాలుగా ఆదుకుంటాన‌ని భ‌రోసా ఇచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నాయ‌కుల‌ను కోల్పోయింద‌ని.. ర‌మేష్, ల‌క్ష్మ‌య్య‌ల‌ మృతి పార్టీకి తీవ్ర న‌ష్టామ‌న్నారు.

అదే విధంగా తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు మెరుగైన చికిత్స అందేలా చూస్తాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!