సదరం శిబిరం.. ఖరారు..!
– 23న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహణ
– జిల్లా వ్యాప్తంగా 360 మందికి స్లాట్లు కేటాయింపు
– తాండూరు మున్సిపాలిటీ నుంచి 25 మంది నమోదు
– ఏయే పత్రాలు తీసుకెళ్లాలంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : దివ్యాంగుల గుర్తింపు, వైకల్య నిర్ధారణ కోసం ఈ నెల 23న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం (సదరం/యూడీఐడీ) శిబిరాన్ని నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరానికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 360 మందికి స్లాట్లు కేటాయించారు. ఇందులో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 4, 5, 6, 7, 8 వార్డులకు చెందిన 25 మంది పేర్లు నమోదయ్యాయి. స్లాట్ జాబితాలో పేర్లు ఉన్నవారు కేటాయించిన తేదీ, సమయానికి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.

పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి. సదరం శిబిరం ద్వారా దివ్యాంగుల వైకల్య స్థాయిని వైద్యులు పరిశీలించి సంబంధిత ధ్రువీకరణ ప్రక్రియ చేపడతారు. జాబితాలో పేర్లు ఉన్నవారు తమకు కేటాయించిన శిబిరం తేదీని గమనించి, అవసరమైన గుర్తింపు పత్రాలు, వైద్య సంబంధిత పత్రాలతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.

వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు:
– ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ ప్రతులు.
– సదరం స్లాట్ బుకింగ్ రసీదు లేదా అక్నాలెడ్జ్మెంట్ ఐడీ వివరాలు.
– గతంలో జారీ చేసిన దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే దాని ప్రతులు.
– సంబంధిత వైకల్యానికి సంబంధించిన పాత వైద్య నివేదికలు, పరీక్షల రిపోర్టులు.
– పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఇతర వైద్య సంబంధిత పత్రాలు ఉంటే జిరాక్సులు.
వివరాలకు.. కింద పరిశీలించండి…
23.11.2026 Vikarabad Hospital SADAREM camp


