పర్మిషన్లతోనే సెల్ టవర్ ఏర్పాటు..!
– జీఓ, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్మాణం
– మున్సిపల్‌కు సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు
– స్పష్టం చేసిన పసారం లలిత్ సందీప్ నిషాంక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌లో నిర్మిస్తున్న సెల్ టవర్‌ను అన్ని రకాల పర్మిషన్లతో చేపట్టడం జరుగుతుందని పసారం లలిత్ సందీప్ నిషాంక్ స్పష్టం చేశారు.

వార్డు నెంబర్ 23లోని వాల్మీకీ నగర్లో ఇళ్ల మద్య సెల్ టవర్ నిర్మిస్తున్నారని, అనుమతులపై అనుమానాలు ఉన్నాయని వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం పసారం లలిత్ సందీప్ నిషాంక్ స్పందించారు.

ప్రస్తుతం వార్డులో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం 2026లో జీఓ జారీ చేసిందని, కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. వాటీ ఆధారంగా సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

జీఓ, కోర్టు ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ నుంచి పర్మిషన్ అవసరం లేకున్నప్పటికీ సమాచారం అందించడంతో పాటు ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోరడం జరిగిందని తెలిపారు. సెల్ టవర్ నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని కొట్టిపారేశారు.


