రేపు ఆకాశంలో అద్భతం

జాతీయం టెక్నాలజీ తెలంగాణ

ఆకాశంలో ఆకుప‌చ్చని తోక‌చుక్క‌
– 70 ఏండ్ల త‌రువాత రేపే నింగిలో ద‌ర్శ‌నం
– సూర్యుని చుట్టూ రౌండ్ వేయ‌నున్న లియోనార్డ్ తోకచుక్క

ద‌ర్శిని డెస్క్ : డెభ్బై ఏండ్ల త‌రువాత ఆకాశంలో మ‌హా అద్బుతం జ‌ర‌గ‌బోతుంది. అంత‌రిక్షంలో ఓ తోక‌చుక్క భూలోక వాసులకు ఆకుప‌చ్చ‌ని రంగులో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతుంది. కొన్ని వేల సంవ‌త్స‌రాలు ప‌ట్టే ఇలాంటి అద్భుతం ఈ డిసెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌బోతుంద‌ని ఖ‌గోళ శాస్త్రర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. మళ్లీ మన జీవితంలో ఇలాంటి దృశ్యాల‌ను తిల‌కించే అవకాశం ఉండదంటున్నారు. ఎన్నో వింత‌లున్న ఆకాశంలో తోక చుక్క ఆకుప‌చ్చ‌ని రంగులో ద‌ర్శ‌నమివ్వ‌బోతుంద‌నే విష‌యం అంద‌రిలో ఉత్సుక‌త‌ను రేకేత్తిస్తోంది.

శాస్త్రవేత్త‌ల అంచ‌నాల ప్ర‌కారం ఈ డిసెంబ‌ర్ నెల‌లో భూమికి ద‌గ్గ‌ర‌గా 5 గ్రహశకలాలు వస్తున్నాయి. అందులో లియోనార్డ్ తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. ఈ సంవత్సరంలో భూమిపై ఉన్నవారికి కనిపించే అత్యంత కాంతివంతమైన తోకచుక్క ఇదే. సాధారణంగా తోకచుక్కలు పసుపురంగులో కనిపిస్తాయి. ఇది మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనాలు మండుతూ చుట్టూ గ్రీన్ కలర్ మెరుపులు వస్తాయి. తోక మొత్తం గ్రీన్ కలర్‌లోనే ఉంటుంది. ఇది డిసెంబర్ నెలంతా ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ… స్పష్టంగా చూడాలంటే డిసెంబర్ 12నే చూడాలి. ఇది భూమికి దగ్గరగా వస్తున్నా… దీని టార్గెట్ మాత్రం సూర్యుడేనట. త్వరలోనే సూర్యుణ్ని చేరుకుని… సూర్యుని చుట్టూ ఓ రౌండ్ వేసి… తిరిగి తన గెలాక్సీవైపు వెళ్లిపోతుందట. ఇది మన పాలపుంత గెలాక్సీ నుంచి కాకుండా… మరో గెలాక్సీ నుంచి మన సూర్యుడి దగ్గరకు వస్తోంది. ఇలా వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఈ తోకచుక్క NGC 4631 అనే గెలాక్సీ నుంచి వస్తోందని శాస్త్రవేత్త‌లు గుర్తించారు.

సూర్యోద‌యానికి ముందు ద‌ర్శ‌నం
ఈ తోకచుక్కకు ఓ తిమింగలంతో సంబంధం ఉంది. అది సముద్రంలో తిరిగే తిమింగలం కాదు. విశ్వంలో ఉండే తిమింగలం. ఈ గెలాక్సీ చూసేందుకు తిమింగలంలా ఉంటుంది. అందుకే దీన్ని తిమింగలం గెలాక్సీ అంటారు. అలాంటి గెలాక్సీ నుంచి వస్తున్న తోకచుక్క కావడం వల్ల లియోనార్డ్ తోకచుక్కపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తోపాటూ… ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ తోకచుక్కను మీరు చూడాలంటే… డిసెంబర్ 12న సూర్యోదయం కాకముందే… ఆకాశంలో తూర్పు-ఈశాన్య దిక్కువైపున… చూడాలి. బైనాక్యులర్ ఉంటే… దీన్ని తేలిగ్గా గుర్తుపట్టగలరు. ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది కాబట్టి మీరు గుర్తించేందుకు వీలవుతుంది. అప్పుడు మిస్సైతే… రోజూ ఉదయం వేళ సూర్యోదయానికి 2 గంటల ముందు ఇది తూర్పు దిక్కులో కనిపిస్తుంది. ఇలాంటి గ్రీన్ కలర్ తోకచుక్క భూమికి దగ్గర్లో రావడం 70,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ తోకచుక్కను చూసిన వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చ‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొంటున్నారు.