మునగాకులో పోషకాలు..!

తెలంగాణ

మునగాకులో పోషకాలు..!
– 300ల రోగాలనం చేసే ఔషద గుణాలు
– జుట్టురాలే సమస్యకు చెక్
దర్శిని డెస్క్‌ : మునగ చెట్టు, కాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మునగ కాయలే కాదు.. చెట్టుకున్న ఆకులు కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో మునగను పోషకాల పవర్​హౌజ్‌గా పిలుస్తారు. దీనిని అమృతంగా పిలుస్తారు. ఎందుకంటే మునగ 300 కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుంది. దీని ఆకులు, కాడలను కూరగాయలుగా ఉపయోగిస్తారు. మునగాకులో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

మునగ ఆకులు విటమిన్ C ని కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మునగ.. రక్తంలో షుగర్​ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. బాలింతలు, పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగపడతాయి. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా.. ఎండిన మునగాకులో 15 రెట్లు అధికంగా ఉంటుంది.

మునగాకులు ఊబకాయం, బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. పెరుగు తినడం వల్ల లభించే ప్రొటీన్ల కన్నా.. మునగాకు నుంచి 8 రెట్లు అధికంగా లభిస్తుంది. పాల నుంచి లభించే క్యాల్షియం కన్నా.. మునగాకు నుంచి 17 రెట్లు అధికంగా లభిస్తుంది.  మునగ ఆకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇది కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. అంతేకాకుండా మూత్రాశయంలో రాళ్లను కరిగించేందుకు మంచి ఔషధంగా పని చేస్తుంది. అలాగే మోరింగలో అనేకమైన విటమిన్లు, మినరల్స్‌ ఉన్నాయి. శరీరంలో కొవ్వును కరిగించేందుకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఇదికూడా చదవండి…

సోయా మిల్క్ వేరీ హెల్త్…!