తెలంగాణకు ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

తెలంగాణకు ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్
– రాష్ట్రంలో అత్య‌ధిక కేసుల న‌మోదు
ద‌ర్శ‌ని డెస్క్ : క‌రోనా కేసుల తగ్గుముఖం త‌రువాత కొత్త వేరియంట్‌గా పుట్టుకొచ్చిన ఒమిక్రాస్ తెలంగాణ రాష్ట్రాన్ని ద‌ఢ పుట్టిస్తోంది. దేశంలో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాలో తెలంగాణ రాష్ట్రం కూడ నిలిచింది. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గుజరాత్, రాజస్థాన్లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 165 కేసులు ఉన్నాయి. కేరళలో 57 కేసులు, తెలంగాణలో 56, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇప్పటివరకు 186 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో సోమవారం కొత్తగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరింది.