సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపాలి
– పోలీసులకు పోలీసుల‌కు విన‌తిప‌త్రం అందించిన కాంగ్రెస్ నాయకులు
– అంబేద్కర్ విగ్రహాం ముందు నిరసన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : భార‌త రాజ్యాంగంప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ సోమవారం తాండూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలీం తదితరులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి పట్టణ పోలీస్టేషన్కు చేరుకుని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి మెమొరెండం అందజేశారు. భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ షుకూర్, నవాజ్, మెయిన్, ఖయ్యం, నవీన్, ఎస్ఎస్యూఐ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.