రైతుల‌కు నాణ్య‌మైన సేవ‌లందించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల‌కు నాణ్య‌మైన సేవ‌లందించాలి
– రైస్‌మిల్ ప్రారంభించిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రైస్‌మిల్ ద్వారా రైతుల‌కు నాణ్య‌మైన సేవ‌లను అందించాల‌ని మాజీ మంత్రి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్, తాండూరు మండ‌లం ఎల్మ‌క‌న్నె స‌హాకార సంఘం చైర్మ‌న్ ఎస్.ర‌వీంద‌ర్ గౌడ్‌కు చెందిన యాలాల మండ‌లం చెన్నారం వ‌ద్ద ఏర్పాటు చేసిన రైస్‌మిల్ ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యింది. ఆదివారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతుల‌కు నాణ్య‌మైన సేవ‌లను అందించాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తము రావు, తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ, డీఆర్డీఎల్ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఘాజీపూర్ నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, యాలాల పీఏసీఎస్‌ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, అజయ్ ప్రసాద్, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ మనపురం రాము, బోయ రవి రాజు, వెంకన్న గౌడ్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, జిల్లా ప్రణాళిక మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, లక్ష్మి నారాయణ, ఇర్ఫాన్, హరిశ్వర్ధన్ రెడ్డి,బీదర్ రాజ్ శేకర్, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.