రాహుల్ గాంధీపై నోరుజారితే ఊరుకునేది లేదు
– అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలి: టీపీసీసీ ఉపాధ్యక్షులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ జాతీయ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీపై నోరు జారితే ఊరుకునేది లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు వేరకు రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలకు పాల్పడిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో చేవేళ్ల పార్లమెంట్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, తాండూరు పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు తాండూరు పట్టణ పోలీసులకు అస్సాం సీఎం విశ్వశర్మపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబపై అనుచిత వాఖ్యలు చేయడం తగదన్నారు. మరోసారి ఇలాంటి వాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, యాలాల మండల అధ్యక్షులు భీమప్ప, రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

