సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రూ.29 లక్షల చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం సహాయ నిధి పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, పెద్దేముల్ మండలం వివిధ ప్రాంతాలకు చెందిన 45 మంది లబ్దిదారులకు రూ. 29 లక్షల 14 విలువైన చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్థిక చేయూతనందిస్తుందన్నారు. సీఎం. సహాయ నిధి పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన పెద్దోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

