నిరుద్యోగుల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

నిరుద్యోగుల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు
– కోట్‌ప‌ల్లిలో టీఆర్ఎస్ నాయకుల సంబ‌రాలు
– సీఎ కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించార‌ని కోట్‌ప‌ల్లి టీఆర్ఎస్ నాయ‌కులు అన్నారు. బుధ‌వారం అసెంబ్లీ ద్వారా సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగ‌ల భ‌ర్తికి ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేర‌కు నాయ‌కులు సంబ‌రాలు జ‌రుపుకున్నారు. కోట్‌పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒగ్లాపూర్ రాములు, ఎంపీపీ నల్లోల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు పతంగి పాండు త‌దిత‌రుల స‌మ‌క్షంలో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభీషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు జేజేలు ప‌లుకుతూ నినాదాలు చేశారు. అనంత‌రం ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా పని చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అభివర్ణించారు. 80,039 ఉద్యోగాల నోటీఫీకేష‌న్ జారీ, 11,103 కాంట్రాక్టు ఉద్యోగాల రెగ్యూల‌రైజ్ నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు ఒగ్లాపూర్ రాజు, అన్న సాగర్ జుంటుపల్లి కృష్ణ, కోట్‌ప‌ల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్త, ఉపాధ్యక్షుడు మరియు కార్యదర్శి కిరణ్, యువజన నాయకులు గడ్డం అనిల్, రైతు సంఘం అధ్యక్షుడు రత్నయ్య, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్, ఆసిఫ్, శివ కుమార్, అంజయ్య, జీ. నర్సింలు, సాంబయ్య , ఎ.నర్సింలు, రమేష్, చిన్న‌ తదితరులు పాల్గొన్నారు.