రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో దర్నా
– జయప్రదం చేయండి: పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి దర్నా చేపడుతున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని, కేంద్రం రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ దర్నా చేపట్టం జరుగుతుందని చెప్పారు. మంగళవారం ఉదయం 10-30 గంటలకు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టే దర్నాకు చేవేళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ఆయనతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

