ఎన్‌హెచ్ 167 లింకురోడ్డు ప‌నులు షురూ..!

జాతీయం తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

ఎన్‌హెచ్ 167 లింకురోడ్డు ప‌నులు షురూ..!
– తాండూరులో రూ. 27 కోట్ల‌తో రోడ్డు నిర్మాణ ప‌నులు
– ప్రారంభించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మహబూబ్ నగర్ నుంచి కోడంగల్, తాండూరు మీదుగా మంజూరైన జాతీయ రహదారి(ఎన్ హెచ్)167కు పట్టణ ప్రాంతాల్లో లింకు రోడ్లు నిర్మించేందుకు కేంద్రం రూ. 631 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో రూ. 27 కోట్లతో నిర్మిస్తున్న ఎన్ హెచ్ 167ఎన్ లింకు రోడ్డు పనులను గురువారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు.

తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాకారంతో తాండూరు మీదుగా ఎన్ హెచ్ 167 రోడ్డును సాధించుకోవడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ నుంచి చించొల్లి మెయిన్ రోడ్డును అనుసంధానం చేస్తూ కేంద్రం రూ. 631 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో కాగ్నానది నుంచి గౌతాపూర్ రోడ్డు వరకు లింకు రోడ్డు పనులను రూ. 27 కోట్లతో చేపడుతున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో ఎన్ హెచ్ 167 లింకు రోడ్డు పనులను పూర్తి చేస్తామని అన్నారు. దీంతో పాటు బైపాస్ రోడ్డు, హైద‌రాబాద్ నుంచి తాండూరుకు నాలుగు వ‌రుస‌ల రోడ్డు, జినుగుర్తి, తట్టెపల్లి, గౌతాపూర్, కరణ్ కోట్ రోడ్లను కూడ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు, మూడేండ్లలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల రోడ్లను పూర్తి చేసి రాజయోగం పట్టిస్తామన్నారు. తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చె యడం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్ల పనులను పూర్తి చేసి తాండూరు ప్రాంతాన్ని కాలుష్యరహితంగా మార్చి చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వార్డు కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల‌ నర్సింలు, శ్రీనివాసాచారి, రాజుగౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కౌన్సిలర్లు విజయాదేవి, మంకాల రాఘవేందర్, ముక్తార్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ రాములు, నాయకులు నర్సింహారెడ్డి, న్యాయవాది గోపాల్, పటేల్ ఉమాశంకర్, ఉర్దూఘర్ చైర్మన్ రజాక్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, కోఆప్షన్ సభ్యుల పోరం నాయకులు ఆక్బర్‌ బాబ, యువనాయకులు, కార్యకర్తలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.