హైవే లింకు రోడ్డులో స్పీడ్ పెంచండి

తాండూరు రాజకీయం వికారాబాద్

హైవే లింకు రోడ్డులో స్పీడ్ పెంచండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పట్టణంలో హైవే లింకు రోడ్డు పనుల పరిశీలన
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మీదుగా చేపడుతున్న 167 ఎన్హెచ్ హైవే లింకు రోడ్డు నిర్మాణ ప‌నుల్లో స్పీడ్ పెంచాల‌ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మ‌హ‌బూబ‌గ్ న‌గ‌ర్ నుంచి మంజూరైన హైవే రోడ్డుకు కాగ్నా నది నుంచి గౌతాపూర్ రోడ్డు వరకు రూ. 27 కోట్లతో చేపడుతున్న హైవే లింకు రోడ్డు పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. మంగళవారం పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద చేపడుతున్న పనులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాస్ చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.