అధికారంతో దాదాగిరి..!
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వల్ల అభివృద్ధి శూన్యం
– సంచలన వాఖ్యలు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ తాండూరు రాజకీయాలపై సంచలన వాఖ్యలు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా పనిచేసిన మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలు వారి అధికారంతో దాదాగిరిలకు పాల్పడుతున్నారని బాంబ్ పేల్చారు. గురువారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ కళాశాలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల వర్గపోరు కారణంగా తాండూరు అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన రోహిత్ రెడ్డి అభివృద్ధి కోసం కారెక్కుతున్నట్లు చెప్పి.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. పాత పనులతోనే హల్ చల్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అధికారం చేపట్టి హైదరాబాద్‌లో భూ కబ్జాలు, దాదాగిరిలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వాఖ్యలు తాండూరు రాజకీయాలలో దుమారం రేపాయి. అదేవిధంగా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేే ఎం నారాయణ రావు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని, తమ కుటుంబానికిిి చెందిన కె నరేష్, రాకేష్ లు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో లేరని చేప్పుకొచ్చారు.

