నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
– రేషన్ డీలర్ల నియమకానికి నోటిఫికేషన్
– ప్రకటించిన తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంత నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నియోజకవర్గంలో రేషన్ డీలర్ల(చౌక ధరల దుకాణం) నియామకానికి నోటికేషన్ జారీ చేసినట్లు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని బషీరాబాద్-1, పెద్దేముల్-3, తాండూరు-7, యాలాల-7 చొప్పున మొత్తం 18 దుకాణాలకు నోటిఫికేషన్ వచ్చిందని స్పష్టం చేశారు.

తాండూరు ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 3వ తేదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 40 ఏండ్ల మద్య వయస్సులో ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులు అయిన వారే అర్హులని స్పష్టం చేశారు. ఆయా గ్రామాలకు చెందిన స్థానికులకు రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు ఉంటాయని, వ్రాత పరీక్ష, ఇంటర్వూల ద్వారా ఎంపిక చేస్తారని వెల్లడించారు.
పరీక్ష, ఇంటర్వూల తేదిలను త్వరలో ప్రకటిస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 10-30గంటల నుంచి సాయంత్రం 5-30గంటల మద్యలో, నిర్ణీత గడువులోగా పని దినాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

