వరధ ప్రవాహంలో ప్రైవేటు స్కూల్ బస్సు
– విద్యార్థులను కాపాడిన స్థానికులు
– మహబూబాబాద్ జిల్లాలో ఘటన
హైదరాబాద్, దర్శినిప్రతినిధి: భారీ వర్షాల వల్ల ప్రవహించిన వరధలో ఓ ప్రైవేటు బస్సు స్థంభించి పోయింది. బస్సులో ఉన్న విద్యార్థులను స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి కాపాడారు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుఉంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దాదాపు 3గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు మత్తడి పోశాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 20.3 సెం.మీ వర్షపాతం రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. తొర్రూరులోని ఆర్యభట్ట ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు నర్సింహులపేటకు వస్తుండగా మార్గ మధ్యంలో వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. బస్సులోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించారు. బస్సులో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించారు.



