త్వరలోనే ప్రజల్లోకి వస్తా..!
– తాండూరు గులాబీ నేతలతో పైలెట్
– రోహిత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలోనే తాండూరు నియోజకవర్గంలోని ప్రజల మద్యకు వస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతలకు అభయం ఇచ్చారు.

బుధవారం తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో హైదరాబాద్లో పైలెట్ రోహిత్ రెడ్డిని పార్టీ కౌన్సిలర్లు, నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి వారితో తాండూరు రాజకీయాలపై చర్చించారు. పార్టీ పరిస్థితులను సమీక్షించారు.

అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తాండూరుకు వస్తానని అభయం అందించారు. ఎవ్వరు ఆధైర్య పడొద్దని భరోసా అందించారు. రోహిత్ రెడ్డిని కలిసిన వారిలో యువ నేతలు సంతోష్ గౌడ్, కరుణాకర్, ఎజాజ్, కౌన్సిలర్లు ఈర్షాద్, సురేష్ నాయక్, అనిల్ ఆర్మీ, యోగానంద్, నవీన సంతోష్ గౌడ్, నాగలక్ష్మీ, సుప్రీత కరుణాకర్ తదితరులు ఉన్నారు.


