ఎమ్మెల్యే @ రూ. 1ల‌క్ష 116

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే @ రూ. 1ల‌క్ష 116
– హిందూ ఉత్స‌వ స‌మితిని విరాళం
– ధ‌న్య‌వాదాలు తెలిపిన స‌మితి స‌భ్యులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరులోని హిందూ ఉత్స‌వ స‌మితికి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆర్థిక తోడ్పాటు అందించారు. వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జ‌న ఉత్స‌వాలు అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు స‌హాకారం అందించారు. శుక్ర‌వారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హిందూ ఉత్స‌వ స‌మితికి రూ. 1ల‌క్ష 116ల‌ను విరాళంగా అంద‌జేశారు. హిందూ ఉత్స‌వ స‌మితి గౌర‌వాధ్య‌క్షులు, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్ స‌మ‌క్షంలో స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలుకు ఈ న‌గ‌దును అంద‌జేశారు. గ‌తంలో హిందూ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు కోరిక మేర‌కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి యాలాల మండ‌లం కోక‌ట్‌లోని కాగ్నాన‌దిలో నిమ‌జ్జ‌నం కోసం విద్యుత్ ట్రాన్స్‌పార్మ‌ర్‌ను ఏర్పాటు చేయిచేందుకు స‌హ‌కారం అందించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉత్స‌వాల‌ను, నిమ‌జ్జ‌నాన్ని ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాల‌న్నారు. అదేవిధంగా స‌మితికి రూ. 1ల‌క్ష 116 లు అందిచ‌డంపై స‌మితి స‌భ్యులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, మార్కెట్ కమిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, భ‌ద్రేశ్వ‌ర దేవాల‌య చైర్మ‌న్ బంటారం సుధాక‌ర్, ఎంపీటీసీ ప్ర‌వీణ్ కుమార్, న‌ర్సిరెడ్డి, స‌మ‌తి స‌భ్యులు పూజారి పాండు, అంతారం కిర‌ణ్, న‌ర్సింహా, న‌రేష్‌, టీఆర్ఎస్ యువనాయ‌కులు అనిల్ బాండ్, శివానంద్, వంశి త‌దిత‌రులు పాల్గొన్నారు.