భద్రేశ్వరాలయ చైర్మన్‌గా బంటారం సుధాకర్
– నియమకపత్రం అందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భద్రేశ్వరాలయ చైర్మన్‌గా తాండూరు టీఆర్ఎస్ నాయకులు బంటారం సుధాకర్ మరోసారి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మంగళవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బంటారం సుధాకర్‌కు అందజేశారు. మరోవైపు దేవాలయ పునరుద్దరణ కమిటి సభ్యులుగా ఎన్నికైన నిర్ని చంద్రశేఖర్, సంగమేశ్వర్, సంపత్, ఏరూర్ గౌరి, సి. చంద్రశేఖర్, వీరప్రసాద్, మధుమతిలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ది వాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. అదేవిధంగా తమవంతు సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఆలయ చైర్మన్ బంటారం సుధాకర్ మాట్లాడుతూ భద్రేశ్వరాలయ చైర్మన్ గా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా ఆలయాభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు డా. సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, రాజుగౌడ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.

