ఐక్యమ‌త్యంతోనే శాంతి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఐక్యమ‌త్యంతోనే శాంతి..!
– హిందూ, ముస్లింల స‌మ‌న్వయం ఆద‌ర్శం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయాల్లో ఐక్య‌మ‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డంతో వల్ల శాంతి సమాజం ఏర్పడుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా తాండూరులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగించడంలో ప్రముఖ పాత్ర పోషించిన హిందూ, ముస్లిం సోదరులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా తాండూరులో నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగించడం సంతోషకరమన్నారు. హిందూ, ముస్లింలు బేధాభిప్రాయం లేకుండా సమన్వయం పాటించడం ఆదర్శనీయమన్నారు. ఎలాంటి అపోహలు, దుష్ప్రచారాలకు తావివ్వకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రశాతంగా జరిగేందుకు సహకరించడం అభినందనీయమన్నారు. హిందూ, ముస్లింల ఐక్య‌మ‌త్యాన్ని కాపాడుతూ ఆద‌ర్శంగా నివాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, స్టేషన్ హనుమాన్ చైర్మన్ సంజీవరావు, మైనార్టీ సోదరులు ముజీవ్, అన్వర్, జబ్బార్, షుకూర్, యువ నాయ‌కులు ఎర్రం శ్రీధర్, గుండప్ప, న‌ర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.