కారు కొట్టుకుపోయిన వాళ్లు బ‌తికొచ్చారు

క్రైం తాండూరు వికారాబాద్

కారు కొట్టుకుపోయిన వాళ్లు బ‌తికొచ్చారు
– భార్య‌, భ‌ర్త‌ల‌కు త‌ప్పిన ప్ర‌మాదం
– వాగులో కొట్టుకుపోయిన కారు
– వికారాబాద్ ధారూల్‌లో సంఘ‌ట‌న
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో వ‌ర్షం మ‌ళ్లీ భీభ‌త్సం సృష్టించింది. వాగులోకి వ‌చ్చిన వ‌ర‌ధ‌లో కారు కొట్టుకుపోయినా అందులో చిక్కుకున్న భార్య‌, భ‌ర్త‌లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న గురువారం వికారాబాద్ జిల్లా ధారూర్ మండ‌లం నాగారం స‌మీపంలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జిల్లాలోని దోర్నాల గ్రామానికి చెందిన దేవ‌నూరు శివ త‌న భార్య మౌనిక‌తో క‌లిసి పండ‌గ కోసం సొంతఊరు వ‌చ్చారు. బుధ‌వారం పండ‌గ జ‌రుపుకుని గురువారం ఉద‌యం వికారాబాద్‌కు బ‌య‌ల్దేరారు. బుధ‌వారం రాత్రి కురిసిన వ‌ర్షానికి నాగారం గ్రామ స‌మీపంలోని వాగు ఉదృతంగా ప్ర‌వ‌హించింది. అదే మార్గంలో కారులో భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రు వెళుతూ వాగు దాటే ప్ర‌య‌త్నం చేశారు. నీటిఉధృతికి కారు నీటిలో కొట్టుకుపోయింది. అప్ర‌మ‌త్త‌మైన భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు కారులో నుంచి బయటికి వచ్చి చెట్లను పట్టుకునారు. గ‌మ‌నించిన గ్రామ‌స్తులు తాళ్ల సాయంతో వారిని బయటికి తీశారు. కొట్టుకుపోయిన కారు వాగులో ఓ చోట ఆగిపోయింది. కారు కొట్టుకుపోయినా భార్య‌, భ‌ర్త‌లు క్షేమంగా బ‌య‌ట ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.