ఇస్కాఫ్ జిల్లా, తాండూరు డివిజన్ కమిటీలు ఎన్నిక
– జిల్లా అధ్యక్షుడిగా బి. జనార్దన్ రెడ్డి
– డివిజన్ అధ్యక్షుడిగా కరణం పురుషోత్తం రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కాఫ్) వికారాబాద్ జిల్లా, తాండూరు డివిజన్ నూతన కమిటీలను రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది కడారు ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షుడిగా బి. జనార్దన్ రెడ్డి (అడ్వకేట్), ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. తాండూరు డివిజన్ అధ్యక్షుడిగా కరణం పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా ఎన్. సుదర్శన్ ఎంపికయ్యారు. జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా ఎంఏ అలీమ్, కిషోర్, రాజశేఖర్, కార్యదర్శులుగా కేశవులు, శ్రీనివాస్, సురేష్, పీర్ మహమ్మద్, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, వెంకటేష్ ఎన్నికయ్యారు.

డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులుగా లెక్చరర్ రాజశేఖర్, శ్రీనివాస్, మౌలానా, అడ్వకేట్ పాశం రవికుమార్, సంజయ్ గౌడ్, శేఖర్, కార్యదర్శులుగా శివ, జిలాని, కేశవులు, నురోద్దీన్, బలరాం, అడ్వకేట్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కడారు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సౌభ్రాతృత్వం, సమైక్యతను పరిరక్షించడమే ఇస్కాఫ్ లక్ష్యమన్నారు. గత 85 సంవత్సరాలుగా ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు సంఘం కృషి చేస్తోందని తెలిపారు.

రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ భిన్న సంస్కృతుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు హైదరాబాద్‌లో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యుద్ధాలు లేని శాంతియుత ప్రపంచ నిర్మాణం కోసం ఇస్కాఫ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక అధ్యక్షుడు బలరాం, కేశవులు, మల్లేశం, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, లెక్చరర్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


