జిల్లాలో స‌ద‌రం క్యాంపు షెడ్యూల్ విడుద‌ల‌

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

జిల్లాలో స‌ద‌రం క్యాంపు షెడ్యూల్ విడుద‌ల‌
– 13 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు క్యాంపులు
– 540 స్లాట్‌ల‌ను ప్ర‌క‌టించిన అధికారులు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో నిర్వహించే స‌ద‌రం క్యాంపు షెడ్యూల్‌ను అధికారులు ప్ర‌క‌టించారు. ఈనెల 13 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు జిల్లాలోని వివిధ ఆసుప‌త్రుల‌లో ఏర్పాటు చేసిన క్యాంపు వివ‌రాల‌ను ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఈసారి వైకల్యానికి సంబ‌ధించి 6 క్యాంపులు, కంటి స‌మ‌స్య‌ల‌కు సంబంధించి 2 క్యాంపులు, మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు సంబంధించి 2 క్యాంపులు, వినికిడి స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఒక క్యాంపును నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం క్యాంపుల కోసం 540 స్లాట్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తేదీల వారిగా జిల్లాలో నిర్వ‌హించే స‌ద‌రం క్యాంపు వివ‌రాలిలా ఉన్నాయి.

వైకల్యం క్యాంపులు ఇవే
ఈనెల 13న సీహెచ్‌సీ ఆసుప‌త్రిలో వికారాబాద్, పూడూరు, దోమ‌, కుల్క‌చ‌ర్ల‌, ప‌రిగి, మ‌ర్ప‌ల్లి, మోమిన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్ప‌ల్లి, వికారాబాద్‌, ప‌రిగి మండ‌లాల‌కు నిర్వ‌హిస్తున్నారు. ఈనెల 20న తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోడంగ‌ల్, బొంరాస్ పేట్, బంటారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్‌, కోడంగ‌ల్ మండ‌లాల‌కు నిర్వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 10న తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో కోడంగ‌ల్ ప‌ట్ట‌ణం, మండ‌లంతో పాటు బంటారం, దౌల్తాబాద్‌, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్ పెద్దేముల్ మండ‌లాల‌కు నిర్వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 17న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రిలో వికారాబాద్ ప‌ట్ట‌ణం, మండ‌లంతోపాటు పూడూరు, దోమ‌, కుల్క‌చ‌ర్ల‌, ప‌రిగి, ప‌రిగి మండ‌లం, మ‌ర్ప‌ల్లి, మోమిన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్‌ప‌ల్లికి సంబంధించి నిర్వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 1న తాండూరు జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కోడంగ‌ల్, బొంరాస్ పేట్, బంటారం, దౌల్తాబాద్, తాండూరు, తాండూరు మండ‌లం, ధారూర్, యాలాల‌, బ‌షీరాబాద్‌, కోడంగ‌ల్ మండ‌లాల‌కు నిర్వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 15న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రిలో వికారాబాద్ ప‌ట్ట‌ణం, మండ‌లంతోపాటు పూడూరు, దోమ‌, కుల్క‌చ‌ర్ల‌, ప‌రిగి, ప‌రిగి మండ‌లం, మ‌ర్ప‌ల్లి, మోమిన్ పేట్, న‌వాబ్ పేట్, కోట్‌ప‌ల్లికి సంబంధించి నిర్వ‌హిస్తున్నారు.

వినికిడి స‌మ‌స్య‌పై క్యాంపు తేది ఇదే
డిసెంబ‌ర్ 29వ తేదీన తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో జిల్లాలోని అన్ని మండ‌లాల‌కు సంబంధించి క్యాంపు నిర్వ‌హిస్తున్నారు.

మాన‌సిక స‌మ‌స్య‌ల‌పై క్యాంపు తేదీలు ఎప్పుడంటే
న‌వంబ‌ర్ 24న, డిసెంబ‌ర్ 22వ తేదిన తాండూరులోని జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అన్ని మండ‌లాల‌కు సంబంధించిన వారికి క్యాంపు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

కంటి స‌మ‌స్య‌ల‌పై క్యాంపు కోసం
న‌వంబ‌ర్ 2వ తేదితో పాటు డిసెంబ‌ర్ 30న వికారాబాద్‌లోని సీహెచ్‌సీ ఆసుప‌త్రిలో అన్ని మండ‌లాల‌కు సంబంధించిన వారికి క్యాంపు ప‌రీక్ష‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు.