మూడో సారి అధికారంలోకి రావాలని..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

మూడో సారి అధికారంలోకి రావాలని..!
– మంత్రి సత్యవతి రాథోడ్‌ భీష్మ ప్రతిజ్ఞ
– టీఆర్ఎస్‌, కేసీఆర్‌పై అభిమానం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ఉద్యమించిన టీఆర్ఎస్(బీఆర్ఎస్‌) పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రంలో మళ్ళీ టీఆరెఎస్ అధికారంలోకి రావాలని కోరుతూ.. మంత్రి సత్యవతి రాథోడ్ భీష్మ ప్రతిజ్ఞ చేపట్టారు. ఇందుకోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆరెఎస్ అధికారంలోకి వచ్చి.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు చెప్పులు లేకుండానే తిరుగుతానని ప్రతిజ్ఞ చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన స్టేజి మీదనే తాను చెప్పులు ధరించడం వదిలేసినట్లు పేర్కొన్నారు. గిరిజనులందరి పక్షాన గిరిజన బిడ్డగా మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. మళ్ళీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే తిరిగి కాళ్లకు చెప్పులు ధరిస్తానని పేర్కొన్నారు సత్యవతి రాథోడ్. ఇది తాను కెసీఆర్ పై ఉన్న అభిమానంతో తీసుకున్న నిర్ణయమని.. పూర్తిగా తన వ్యక్తిగతమని వెల్లడించారు మంత్రి సత్యవతి.