ప్రోటోకాల్ లేకుండా పనులు చేపడతారా.?

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రోటోకాల్ లేకుండా పనులు చేపడతారా.?
– అధికారులపై ఫిర్యాదు చేస్తా
– అభివృద్ధికి ఎప్పుడు అడ్డం కాను
– 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంపీ నిధులను అడ్డంపెట్టుకుని బీజేపీ నేతలు అనువుగాని చోట అభివృద్ధి పనులు చేపట్టారని తాండూరు మున్సిపల్ 24వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి అన్నారు.

శనివారం వార్డులో ఎంపీ నిధులు రూ. 5లక్షలతో సీసీ రోడ్డు పనులను బీజేపీ నాయకులు ప్రారంభించారు. దీనిపై కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి స్పందించి నేతల వైఖరిని ఖండించారు.

వార్డు కౌన్సిలర్‌ ఉన్న తనకు సమాచారం అందించకుండా పనులు ప్రారంభించారని అన్నారు. ప్రోటోకాల్ కూడా పాటించలేదని అన్నారు. అదేవిధంగా ఎంపీ నిధులతో ఓ నేత తన ఇంటి సమీపంలో పనులు చేపట్టడంలో స్వార్థం అర్థమవుతుందని విమర్శించారు.

అభివృద్ధికి తాను ఎప్పుడు అడ్డం కాదని స్పష్టం చేశారు. సమాచారం లేకుండా కౌన్సిలర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా పనులు ప్రారంభించడంపై అసంతృఫ్తి వ్యక్తం చేశారు. పనుల ప్రారంభంలో దృష్టిసారించని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు