గొంతు నొక్కడమే కాంగ్రెస్ వైఖరి

తాండూరు రాజకీయం వికారాబాద్

గొంతు నొక్కడమే కాంగ్రెస్ వైఖరి
– బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం
– రాష్ట్ర నాయకులు యు.రమేష్ కుమార్
– తాండూరులో బీజేపీ నేతల అరెస్టుపై ఆక్రోశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతిపక్షాల గొంతునొక్కడమే కాంగ్రెస్ వైఖరిగా మారిందని బీజేపీ రాష్ట్ర నాయకులు యు.రమేష్‌ కుమార్ అన్నారు.

ఢిల్లీలో సీజేపీ, కాంగ్రెస్ నాయకుల వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం పోలీసులు బీజేపీ నాయకులు యు. రమేశ్ కుమార్, బీజేపీ కౌన్సిలర్లు అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు కృష్ణ ముదిరాజ్, విజయ్ పటేల్, అంతారం లలిత, ప్రకాష్, షాబుద్దీన్ లను వారి నివాసాల వద్ద అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.

అదేవిధంగా పెద్దేముల్ మండలoలో బీజేపీ అధ్యక్షులు వీరేశం, సందీప్ కుమార్, హరీష్ గౌడ్, యాదయ్య, వార్డు మెంబెర్ రవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు బీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ నేతల గొంతునొక్కేందుకు యత్నించడం దుర్మార్గమని అన్నారు. ముందస్తు అరెస్టుల పేరుతో రాజ్యాంగబద్ధమైన హక్కులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలను కాలరాచడమే అన్నారు. ఇలాంది వైఖరిని మార్చుకోవాలని అన్నారు. ఢీల్లిలో జరుగుతున్న వివాదాన్ని అందరు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో దీనికి తగినంత అనుభవించడం ఖాయమన్నారు.

శాకాంబరీ మాత నమోస్తుతే..!