గగనం నుంచి గమ్మత్తు మిషన్..!
– మొగిలిగుండ్ల గ్రామంలో పడిన వింత శకటం
– ఆసక్తిగా తిలకించిన జనం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఆకాశ గగనం నుంచి ఓ వింత శకటం జారిపడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిదిలోని మొగ్గిలిగుండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సమీప గ్రామ ప్రజలు వింత పరికరం చుట్టూరా చేశారు. చూడడానికి ఆదిత్య 369 సినిమాలో ఉన్న టైం మిషన్ మాదిరిగా కనిపించడంతో జనం ఆసక్తిగా తిలకించారు. అందరు మిషన్ ను పరిశీలిస్తుండగా దాని చుట్టు కెమరాలు ఉండడం, ఫ్యారశుట్ మాదిరిగా తాళ్లు ఉండడం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాని వారికి కూడ ఇదేం మిషన్ అని తెలియకపోవడంతో అయోమయం చెందారు. వెంటనే తహసీల్దార్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకునేందుకు హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ వారు మిషన్ ద్వారా ప్రయోగం చేశారని పుకారు పుట్టుకొచ్చింది.

