తెలంగాణ తల్లి సోనియమ్మా.!
– తాండూరులో ఘనంగా జన్మదినం
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రా న్ని అందించిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటూ తాండూరు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరిగాయి. శుక్రవారం తాండూరు పట్టణ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నేతలు హాజరయ్యారు. సోనియాగాంధీ జన్మదినం పురస్కరించుకుని కార్యాయలంలో నేతలంతా కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు. సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆమె ప్రకటనతోనే దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని గుర్తుచేశారు. సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్ జనరంజక పాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, సర్దార్ ఖాన్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, సయ్యద్ షుకూర్, కొర్వార్ నగేష్, నవాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, మోహిన్, నాయకులు ఖయ్యూం. యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

