దుబాయ్‌లో తెలంగాణ డ్రైవర్‌కు జాక్‌పాట్
– లాటరీలో 33 కోట్లు గెలుచుకున్న అదృష్టవంతుడు
దర్శిని డెస్క్ : కష్టపడే వారికి అదృష్టం ఎప్పుడు సహకరించదని వాదిస్తుంటారు. ఎప్పుడో.. ఎవరికో ఒకరికి వరిస్తుందని కూడ అంటుంటారు. కుటుంబం కోసం కష్టపడి దేశం దాటి వెళ్లిన ఓ వ్యక్తికి అలాంటి అదృష్టం వరించి ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. రూ. 30 కోట్లు సొంతం చేసుకున్నా నమ్మలేని స్థితిలో ఉన్నానని చెబుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన అజయ్ కుటుంబ పోషణ కోసం డబ్బులు సంపాదించేందుకు దుబాయ్ వెళ్లాడు. నాలుగేళ్ల క్రితం పని కోస వెళ్లి ఓ నగల దుకాణంలో నెలకు రూ. 72 వేల(3,200 దిర్హామ్‌లు) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం 30 దిర్హాములు చెల్లించి ఓ లాటరీ కొన్నాడు. దానికి రూ. 33 కోట్లు వచ్చాయని మీడియాలో ప్రకటించారు. దీంతో అజయ్‌కు లాటరీ రూపంలో లక్ష్మిదేవి భారీ అదృష్టాన్ని ప్రసాదించింది. మామూలు డ్రైవర్ గా కష్టపడి పనిచేసిన అజయ్ ఇప్పుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. భారీ మొత్తాన్ని గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన అజయ్.. ‘తాను రూ.33 కోట్లు గెలుచుకున్నానని చెప్పాడు. తనకు లాటరీ తగిలిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పినప్పుడు వారు కూడా నమ్మలేదన్నాడు. తనకు లాటరీ తగిలిందన్న వార్త మీడియాలో వచ్చినప్పుడే వారంతా తనను నమ్మారని చెప్పాడు. తనకు లక్కీ లక్ష్మి లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు వచ్చిన లాటరీ డబ్బుతో తన కలలన్నీ నెరవేర్చుకుంటానన్నారు. అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి మా గ్రామం, చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలకు సహాయం చేస్తాను. మా ఇంటి కోరికలు తీరుస్తానన్నాడు అజయ్ . బ్రిటీష్ మూలానికి చెందిన పౌలా లీచ్ ఇదే లాటరీలో రూ. 17.5 లక్షలు (దిర్హం 77,777) గెలుచుకున్నారు.

