చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..!
– కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన
– అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేతనైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తాండూరు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.

మంగళవారం సీనియర్‌ నాయకుడు విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు తాండూరు పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేయడం సరికాదని, హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరిగేలా పాలన సాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, నాయకులు సంతోష్ గౌడ్, కరుణాకర్, సంజీవరావు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..!