ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..!
– హత్యలా.. ఆత్మహత్యలా..
– అసలేం జరిగింది?
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఇద్దరి మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపింది. ఆడ, మగ వ్యక్తుల మృతదేహాలు కావడంతో స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాల సమీపంలో పురుగుల మందు డబ్బాలు లభించినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ పురుగుల మందు సేవించి మృతి చెందారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. మృతుల వివరాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నారు. ఇద్దరూ ఒకే చోట మృతి చెంది ఉండటంతో ఘటన వెనుక అసలు కారణమేంటన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

హత్యా? ఆత్మహత్యా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి