అందరికి నచ్చేలా ఐస్ క్రీం సేవలు
– స్కోప్స్ ఐస్ క్రీం స్టేట్ మేనేజర్ శివారెడ్డి
– తాండూరులో జయ సాయి ఐస్ క్రీం ఏజెన్సీ ప్రారంభం
– సాయి మందిరంలో భక్తులకు ఉచితంగా ఐస్ క్రీం పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులు, పెద్దలు మెచ్చేలా.. అందరికి నచ్చేలా ఐస్ క్రీం సేవలను అందిస్తామని స్కోప్స్ ఐస్ క్రీం స్టేట్ మేనేజర్ శివారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఐబీ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన జయ సాయి ఐస్ క్రీం ఏజెన్సీని నిర్వహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కోప్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసే ఏజెన్సీలలో తక్కువ ధరకే ఐస్ క్రీంలు అందించడం జరుగుతుందన్నారు. అందరికి నచ్చే విధంగా.. మెచ్చే విధంగా సర్వీసు ఇస్తామన్నారు. జయ సాయి ఏజెన్సీ యజమాని భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ పెళ్లిళ్లు, పుట్టిన రోజు, గృహ ప్రవేశం వంటి ఇతర శుభకార్యాలకు జయ సాయి ఏజెన్సీ ద్వారా ఐస్ క్రీం సర్వీసు అందిస్తామన్నారు. జయ సాయి ఏజెన్సీ కింద తాండూరు పట్టణంతో పాటు మండలం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లో సేవలను అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులు ముందుగా సమాచారం అందిస్తే మెరుగైన సేవలను అందిస్తామన్నారు. మరోవైపు జయ సాయి ఐస్ క్రీం ఏజెన్సీ ప్రారంభోత్సవం సందర్భంగా యజమాని తాండూరు పట్టణంలోని శ్రీ షిర్డీ సాయి మందిరంలో భక్తులకు ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, సాయిలు గౌడ్, హన్మంత్ రెడ్డి, రవి, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

