నేను ఎమ్మెల్యే ఫ్యాన్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నేను ఎమ్మెల్యే ఫ్యాన్‌..!
– పైలెట్ రోహిత్ రెడ్డి పేరుతో పచ్చబొట్టు
– బీఆర్ఎస్ యువకుడి వీరాభిమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహానీయులకు, క్రికెట్ స్టార్లకు, సినిమా స్టార్లకు, రాజకీయ నాయకులు అభిమానులు ఉండడం సాధారణమే. అదే తరహారాలో వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు నేను ఎమ్మెల్యే ఫ్యాన్ అంటున్నాడు. ఆయనపై ఉన్న అభిమానంతో చేతిపై పచ్చబొట్టు వేసుకుని వీరాభిమానాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజక వర్గం బషీరాబాద్ మండలం కొర్వి చేడ్ ఘని గ్రామానికి చెందిన శివకు తాండూరు పైలెట్ రోహిత్ రెడ్డి అంటే అభిమానం. యంగ్ లీడర్స్ సంస్థలో కొనసాగుతున్న తరుణంలోనే శివకు రోహిత్ రెడ్డితో ఏర్పడిన పరిచయం అభిమానంగా ఏర్పడింది. అప్పటి నుంచి శివ రోహిత్ రెడ్డి వెంటే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేపై ఉన్న అభిమానంతో పైలెట్ రోహిత్ అని తన కుడి చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన హీరో అని, ఆయన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమని శివ పేర్కొంటున్నాడు. పచ్చబొట్టు వేయించుకున్న శివను పలువురు నేతలు అభినందిస్తున్నారు. శివ ప్రస్తుతం టీఆర్ఎస్ యువనాయుకుడుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా శివ ఇప్పుడు శివమాల ధారణలో ఉన్నారు.