లారీ అసోసియేషన్ ఎన్నికలు హర్షణీయం
– సభ్యులందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
– అధ్యక్ష, కార్యదర్శులతో ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్‌కు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించడం హర్షణీయమని వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వైట్ ప్యాలస్ ఫంక్షన్ హాల్ లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చిక్కాల శ్రీనివాస్ పై అబ్దుల్ గాని 227 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. నూతన అధ్యక్షులు అబ్దుల్ గని, ప్రధాన కార్యదర్శిగా నరసింహారెడ్డిని ప్రకటించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అబ్దుల్ గని, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలను అభినందించారు. శాలువా, పూలమాలలతో సత్కరించి.. సన్మానించారు. ఈ సందర్భంగా విట్టల్ నాయక్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యపద్యంగా అసోసియేషన్ అధ్యక్షుని ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటు అసోసియేషన్ అభివృద్ధికై కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, సయ్యద్, బాండ్ తదితరులు ఉన్నారు.

