చదవడంలో పట్టు సాధించాలి
– పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాసాచారి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు స్పష్టంగా చదవడంలో పట్టు సాధించాలని పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారీ అన్నారు. సోమవారం మాతృభాష దినోత్సవంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 100 రోజుల రీడింగ్ (చదువు ఆనందించు అభివృద్ధి చెందు) కార్యక్రమాన్ని పురస్కరించుకుని కందనెల్లి ప్రాథమిక పాఠశాలను వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారి సందర్శించారు. ఈ సందర్భంగా రీడింగ్ కార్యక్రమంలో విద్యార్థుల చదువుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వల్ల మూతపడిన బడులతో విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు రీడింగ్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు స్పష్టంగా.. తప్పుల్లేకుండా చదవడం. అలవర్చుకోవాలన్నారు. మరోవైపు మాతృభాష తెలుగుపై అందరు పట్టుసాధించాలన్నారు.
మరోవైపు పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యా వ్నా భోజనాన్ని వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారీ పరిశీలించి.. నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యా కవి టీ చైర్మన్ నర్సింలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

