భవిష్యత్తులో డ్రోన్‌ల సాగుకే ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

భవిష్యత్తులో డ్రోన్‌ల సాగుకే ప్రాధాన్యం
– సమయం ఆధాతోపాటు రైతులకు ఆధాయం
– తాండూరు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డా. సుధారాణి
– కుసుమ పంట మందుల పిచికారిపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: భవిష్యత్తులో డ్రోన్‌ల సాగుకే ప్రాధాన్యం ఉంటుందని, డ్రోన్‌ సాగు వ్యవస్థతో రైతులకు సమయంతో పాటు ఆధాయం లభిస్తుందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా.సీ.సుధారాణి అన్నారు. బుధవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కుసుమ పంట సాగులో డ్రోన్లతో మందుల పిచికారిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్ర వేత్త సుధారాణి మాట్లాడుతూ పంటల సాగులో డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. మందుల పిచికారితో పాటు కలుపు నివారణ చేసుకోవచ్చన్నారు. ఈ విధానంలో పంటలపై మందుల పిచికారి సమర్థవంతంగా జరుగుతోందన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందని, కూలీల కొరత సమస్య తీరుతుందన్నారు. రైతులందరు పెద్ద మొత్తంలో ఎకరాలను చూపిస్తే డ్రోన్ల మందుల పిచికారి సంస్థ నిర్వహకులు చేస్తారని తెలిపారు. అదేవిధంగా డ్రోన్లతో మందుల పిచికారిపై కూడ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంత మోతాదులో మందులు పిచికారి చేయాలి, ఎంత ఎత్తులో చేయాలనే విషయాలను తెలసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో డ్రోన్లతో సాగుకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. రైతులు ఆధాయాన్ని కూడ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం శాస్త్ర వేత్త డా. సి.సుధాకర్, వ్యవసాయ విశ్వవిద్యాల పరిశోధన, విస్తరణ సలహా మండలి సభ్యులు ద్యావరి నారాయణ, శాస్త్ర వేత్తలు రాజేశ్వర్ రెడ్డి, సుజాత, సందీప్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.