నిమ‌జ్జ‌నానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

నిమ‌జ్జ‌నానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– కాగ్నాన‌దిలో ఏర్పాట్ల ప‌రిశీల‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాబోయే గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ తాటికొండ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. బుధ‌వారం తాండూరు ప‌ట్ట‌ణ శివారులోని కాగ్నాన‌ది వంతెన‌ను మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న‌, తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్‌రెడ్డి, హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిపూర్ బాల్‌రెడ్డి, ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం కాగ్నానది నిండుగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో అక్క‌డ నిమ‌జ్జ‌న వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని సూచ‌న‌ప్రాయంగా నిర్ణ‌యించారు. ఈ మేర‌కు కాగ్నాన‌దిలో నిమ‌జ్జ‌నం కోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై సంద‌ర్శించి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న మాట్లాడుతూ నిమ‌జ్జ‌నానికి వ‌చ్చే భ‌క్తుల కోసం న‌దివ‌ద్ద ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా పోలీసుల‌తో బందోబ‌స్తు, విద్యుత్, నీటిపారుద‌ల, అగ్నిమాప‌క శాఖ‌ల అధికారులు వారి ప‌రిధి నుంచి త‌గు ఏర్పాట్ల‌ను చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ సిందూజ‌గౌడ్, టీఆర్ఎస్ నాయ‌కులు బంటు మ‌ల్ల‌ప్ప‌, బోయ‌రాజు, బీజేపీ కౌన్సిల‌ర్ సంగీత ఠాకూర్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.