నిమిషం లేటైనా నో ఎంట్రీ..!

కెరీర్ తాండూరు వికారాబాద్

నిమిషం లేటైనా నో ఎంట్రీ..!
– రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
– గంట ముందే కేంద్రాలకు అనుమతి
– తాండూరులో 8 కేంద్రాలు, 4800 మంది విద్యార్థులు
– వెల్లడించిన కస్టోడియన్‌లు మల్లినాథప్ప, కృష్ణయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలకు తాండూరులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి కూడ నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలులో ఉంటుందని తాండూరు కస్టోడియన్‌లు మల్లినాథప్ప, కృష్ణయ్యలు వెల్లడించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో జనరల్‌ విద్యార్థులకు, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందన్నారు. జనరల్ విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, చైతన్య జూనియర్ కాలేజీ. సింధు బాలికల జూనియర్. కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను కేటాయించగా.. ఒకేషనల్‌కు సంబంధించి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేసీ, టీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలను కేటాయించడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరంలో 2300 మంది, రెండో సంవత్సరంలో దాదాపు 2500ల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరంకు సంబంధించి 600లు, రెండో సంవత్సరంకు సంబంధించి 500ల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. జనరల్ విభాగంలో మొదటి సంవత్సరంకు సంబంధించి 1700, రెండో సంవత్సరంకు సంబంధించి 1900 నుంచి 2000 వేల మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. వారితో పాటు ప్రైవేటుగా మరో 150 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందని, మొత్తంగా 4800ల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం లేటైనా పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి, భయం సమస్యలు ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 14416కు ఫోన్ చేయొచ్చన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలనే ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.