పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– జయంతిలో నివాళులు అర్పించిన చైర్ పర్సన్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అజరామరంగా నిలుస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం తాండూరు: పట్టణంలోని ఆర్యవైశ్య సమీపంలో పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై ఆర్యవైశ్య సంఘం, వాసవీ మహిళ సంఘం సభ్యులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు పలువురు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతి అజరామరమని అన్నారు. తెలుగు ప్రజల కోసం చేసిన సేవలతో ఆయన గొప్ప మహనీయుడుగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోట మురళీ, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, సంఘం సీనియర్ నాయకులు కోస్గి తిప్పయ్య, సల్లా దామోదర్, యువజన సంఘం నాయకులు కోట్రిక శ్రీకాంత్, వాసవీ మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

