9 ఏండ్ల నుంచి ఫ్రీ హెల్మెట్లు..!

ఆరోగ్యం కెరీర్ జాతీయం తెలంగాణ హైదరాబాద్

9 ఏండ్ల నుంచి ఫ్రీ హెల్మెట్లు..!
– ఇళ్లు, నగలు అమ్మి ఉచిత సేవ
– అభినందించిన కేంద్ర మంత్రులు
– పంపిణీ వెనుక కారణం తెలిస్తే..
దర్శిని డెస్క్‌: ఒక్కోసారి ప్రాణం పోతోందంటే ఎవరైనా సాయం చేసేందుకు వెనుకడుగు వేస్తారు. అదే అలాంటి ప్రాణాలు పోవోద్దని ముందుకు వచ్చి సాయపడే వాళ్లు కొందరే ఉంటారు. అలాంటి ఓ వ్యక్తం 9 ఏండ్లుగా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్నాడు. పేరు కోసమో.. స్వార్థం కోసమో చేస్తున్నది కాదు. ఎందకంటే ఈ సేవ కోసం అతను తన ఫ్లాట్‌ను, భార్య నగలను అమ్మి చేస్తున్నాడు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు వెళ్తూ ఎవరైనా కనిపిస్తే వెంటనే అతణ్ని ఆపేస్తాడు. వెంటనే ఆ వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని చెంపి పంపిస్తాడు.

తన సంపాదనలో ఇలా హెల్మెట్ల పంపిణీ గత 9 ఏండ్లనుంచి నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన 56,000 హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశాడు. దీని వెనుక అతను బలమైన కారణమే చెబుతున్నాడు. అదేదేంటంటే కొన్నేళ్ల క్రితం ఓ రోజు రాఘవేంద్ర కుమార్‌ స్నేహితుడు బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి బైక్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర ఆవేదనచెందాడు. ఆకుటుంబానికి స్నేహితుడు ఒక్కడే సంతానం కావడంతో తీరనిలోటు మిగిలింది. ఆదే ఆయనలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడిలా మరొకరు ప్రాణాలు కోల్పోకూడదని, తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు. ఈ సేవ కోసం ఆయన గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్ ను అమ్మేసాడు. అంతేకాదు, తన భార్య నగలను సైతం తాకట్టు పెట్టి మరీ ఉచిత హెల్మెట్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా మంత్రి గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం రాఘవేంద్ర కుమార్ సేవలను ప్రశంసించారు. దీంతో రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. రాఘవేంద్ర హెల్మెట్లనే కాదు పేద, మద్యతరగతికి చెందిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను కూడ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడ 2016 నుంచి నిర్వహిస్తున్నాడు.