వివాహా వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– గృహప్రవేశంలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో జరిగిన వివాహా వేడుకలతో పాటు గృహ ప్రవేశ వేడుకలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో తాండూరు మండలం అంతారం మాజీ సర్పంచ్ వడ్డె శేఖర్, ఎంపీటీసీ శ్యామల కుమారుడు వివాహము జరిగింది. వివాహా వేడుకకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీంతో పాటు పట్టణంలో పలు పంక్షన్ హాల్ లలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అదేవిధంగా గృహప్రవేశ వేడుకకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు రాము, బోయరవి, నాయకులు నాయకులు పట్లోళ్ల బాల్ రెడ్డి, గడ్డల రవీందర్, మల్కాపూర్ పండరి, ఇందూరు ప్రకాష్, మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, ఎంపీటీసీ శాంతుకుమార్, కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…


