భళా… బంటు మ హేష్ ..!
– నీట్‌లో ఫ్రీ సీటుపై అభినందనలు
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భళా.. బంటు మహేష్ అంటూ తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టణానికి చెందిన పార్టీ నేత కుమారున్ని అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు మల్లప్ప కుమారుడు బంటు మహేష్ నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫ్రీ సీటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ నివాసంలో బంటు మల్లప్ప సమక్షంలో బంటు మహేష్ ను అభింనందించారు. శాలువాతో సన్మానించి శభాష్ అంటూ.. నీట్‌లో ఫ్రీ సీటు సాధించడం గర్వకారణమన్నారు. వైద్య విద్యను పూర్తి చేసి తాండూరు ప్రాంత ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. మరోవైపు తాండూరుకు చెందిన శ్రీ సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ కూడా నీట్ లో ఫ్రీ సాధించిన బంటు మహేష్ ను అభినందించారు.
ఇది కూడా చదవండి…


