ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి
– స్పీకర్‌పై అనుచుత వాఖ్యలు సరికాదు
– తాండూరు పోలీసులకు నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష కుమార్ డిమాండ్ చేశారు.

సోమవారం పార్టీ నేతలతో కలిసి తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో ఎమ్మెల్సీ తాతా మధుపై ఫిర్యాదు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని, వారిని అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని మండిపడ్డారు.

వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయనపై చర్యలు తీసుకుని.. ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, తాండూరు ఉర్ధుఘర్ చైర్మన్ జలాల్, సుదర్శన్ గౌడ్, బెల్కటూర్ వెంకటేష్, బాలరాజు, జోగుల ఎబినేజర్ తదితరులు ఉన్నారు.


